Mahesh Babu: ఇంతకీ మహేశ్ సినిమాలో నాయిక ఎవరో!

Bollywood heroine considered for Mahesh movie
షార్ట్స్‌లో చూడండి
స్టార్ హీరోల సినిమాలకి హీరోయిన్ల ఎంపిక అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. పెద్ద కసరత్తు జరుగుతుంది. సదరు కథానాయిక 'ఎ' గ్రేడ్ హీరోయిన్ అయివుండాలి.. మంచి ఫాలోయింగ్ వుండాలి.. హీరోతో ఇమ్మీడియట్ రిపీట్ అవకూడదు.. పారితోషికం అందుబాటులో వుండాలి.. మరీ ముఖ్యంగా తాము ఎంచుకున్న హీరోయిన్ డేట్స్ దొరకాలి.. ఇవన్నీ కలసిరావాలి. అందుకే హీరోయిన్ ఎంపిక ఓ పట్టాన తెమలదు.. ఇంకా చెప్పాలంటే, అది పెద్ద ప్రక్రియ!

ఇక విషయానికి వస్తే, మహేశ్ బాబు తన తాజా చిత్రాన్ని పరశురాం దర్శకత్వంలో చేస్తున్న విషయం విదితమే. 'సర్కారు వారి పాట' పేరిట రూపొందే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇక వచ్చే నెలలో సెట్స్ కి వెళ్లడానికి కూడా రెడీ అవుతున్నారు. అయితే, ఇంతవరకు కథానాయిక ఎంపిక మాత్రం పూర్తికాలేదు.

'ఈ చిత్రంలో ఫలానా హీరోయిన్' అంటూ ఇంతవరకు చాలా మంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. నిన్నటివరకు ఇందులో బాలీవుడ్ నటి కైరా అద్వానీ నటిస్తుందంటూ వార్తలొచ్చాయి. అయితే, తాజాగా బాలీవుడ్ కి చెందిన మరో అమ్మాయి సయీ మంజ్రేకర్ పేరు వినిపిస్తోంది. తనైతే ఫ్రెష్ నెస్ కూడా ఉంటుందని భావిస్తూ, ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఏమైనా, కథానాయిక ఎవరన్నది త్వరలో తెలిసిపోతుంది.  
Go Back to Shorts
Mahesh Babu
Saie Manjrekar
Parashuram
Sarkaru Vari Pata

More Telugu News