Ram Gopal Varma: వర్మ, మియా మాల్కోవా సినిమా విడుదల తేదీ ఇదే!

RGV and Mia Malkova Climax movie releas date announeced
  • లాక్ డౌన్ లో 'కరోనా' చిత్రాన్ని తెరకెక్కించిన వర్మ
  • ఇదే సమయంలో 'క్లైమాక్స్' పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన వైనం
  • 6వ తేదీ రాత్రి 9 గంటలకు 'క్లైమాక్స్' విడుదల
లాక్ డౌన్ నేపథ్యంలో సినీ పరిశ్రమ కార్యకలాపాలు మొత్తం స్తంభించిపోయాయి. నటీనటులు, దర్శకనిర్మాతలు, టెక్నీషియన్లు మొత్తం ఇంటికే పరిమితమయ్యారు. అయితే, రామ్ గోపాల్ వర్మ మాత్రం ఈ గ్యాప్ లో 'కరోనా వైరస్' అనే సినిమాను తీశాడు. అంతేకాదు పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో లాక్ డౌన్ కు ముందు తీసిన 'క్లైమాక్స్' సినిమాకు సంబంధించిన ప్యాచ్ వర్కు పూర్తి చేశాడు. లాక్ డౌన్ సమయంలోనే టీజర్, ట్రైలర్ ను విడుదల చేశాడు.

మియా మాల్కోవాతో తీసిన 'క్లైమాక్స్' సినిమాను జూన్ 6వ తేదీన వర్మ విడుదల చేస్తున్నాడు. RGVWorld.in / ShreyasET లో 6న రాత్రి 9 గంటలకు రిలీజ్ చేస్తున్నాడు. ఈ చిత్రం చూడాలంటే రూ. 100 చెల్లించాల్సి ఉంది.
Ram Gopal Varma
Mia Malkova
Tollywood

More Telugu News