మళ్లీ పదవిలోకి వచ్చాను.. 'స్థానిక' ఎన్నికలపై సమావేశం నిర్వహిస్తాను: నిమ్మగడ్డ రమేశ్ కీలక వ్యాఖ్యలు
- వ్యవస్థలకు కట్టుబడి వ్యవహరించాలి
- వ్యక్తులు శాశ్వతంగా ఉండరు
- రాజ్యాంగ సంస్థలు, వాటి విలువలు మాత్రమే చిరస్థాయిగా ఉంటాయి
- పరిస్థితులన్నీ అనుకూలించాక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ
వ్యక్తులు శాశ్వతంగా ఉండరని, రాజ్యాంగ సంస్థలు, వాటి విలువలు మాత్రమే చిరస్థాయిగా ఉంటాయని చెప్పారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తాను మళ్లీ పదవిలోకి వచ్చానని ప్రకటించారు. తాను ఇకపై కూడా గతంలో మాదిరిగానే నిష్పక్షపాతంగా పనిచేస్తానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తాననీ, పరిస్థితులన్నీ అనుకూలించాక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలనుకుంటున్నట్లు వెల్లడించారు.