మహిళల మేకప్: కరోనా కారణంగా ఏ సేల్స్ పెరిగాయి? ఏ సేల్స్ దారుణంగా పడిపోయాయి?
- పడిపోయిన లిప్ స్టిక్ వినియోగం
- మాస్కుల కారణంగా లిప్ స్టిక్ వేసుకోని మహిళలు
- పెరిగిన ఐ మేకప్ కు సంబంధించిన కొనుగోళ్లు
ఈ సందర్బంగా ప్రముఖ కాస్మొటిక్స్ కంపెనీ లోరియల్ ఇండియా డైరెక్టర్ కవిత ఆంగ్రే మాట్లాడుతూ, మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదని, వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారని... దీంతో లిప్ స్టిక్ కు డిమాండ్ పడిపోయిందని చెప్పారు. అఫీషియల్ వీడియో ప్రజెంటేషన్ లో కనిపించాల్సి వచ్చినప్పుడే లిప్ స్టిక్ వేసుకుంటున్నారని అన్నారు.
హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, లాక్ డౌన్ కారణంగా కొనుగోళ్లు తగ్గాయని... మార్కెట్ పూర్తి స్థాయిలో తెరుచుకున్న వెంటనే అన్నీ పూర్వ స్థితికి వస్తాయని భావిస్తున్నామని చెప్పారు.