lion: కారు డోరు తీసిన సింహం.. వణికిపోయి కేకలు పెట్టిన అమ్మాయిలు.. వీడియో వైరల్

  • అటవీప్రాంతంలో పర్యటించిన పర్యాటకులు
  • కారును ఆపి సింహాలను వీడియో తీసిన వైనం
  • కారు వద్దకు వచ్చి పంటితో డోరును లాగిన సింహం
Lioness opens safari car door with her teeth  Scary old video goes viral

ఓ కారు వద్దకు వచ్చిన సింహం డోరు తీయడంతో అందులోని అమ్మాయిలు గజగజా వణికిపోయి భయంతో కేకలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఢిల్లీలోని ఓ అటవీ ప్రాంతంలోకి వచ్చిన పర్యాటకులు ఓ ప్రాంతంలో  కారుని ఆపి సింహాలను చూశారు. వాటిని వీడియో తీస్తూ ముచ్చట్లు చెప్పుకున్నారు.

అదే సమయంలో ఓ సింహం కారు వద్దకు వచ్చింది. అది కారు డోరు వద్ద నిలబడినప్పటికీ అది కారు డోరును తీయలేదని వారు అనుకున్నారు. అయితే, ఆ సింహం పంటితో డోరును లాగడంతో అది ఓపెన్ అయింది. దీంతో కారులోని అమ్మాయిలు భయంతో కేకలు వేస్తూ డోరును మళ్లీ మూసేశారు. ఈ వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

More Telugu News