పిల్లిని చంపి.. టిక్ టాక్ వీడియో.. యువకుడి అరెస్టు!
- తమిళనాడు, తిరునల్వేలి జిల్లాలో ఘటన
- టిక్‌టాక్‌లో పాప్యులర్ అవ్వాలని యువకుడి చర్య
- పలు సెక్షన్ల కింద కేసు నమోదు
ఈ విషయం పోలీసులకు తెలియడంతో అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా సెట్టికుళంలో చోటు చేసుకుంది. ఆ యువకుడి పేరు తంగదురై అని, పశువుల ఫాంలో పని చేస్తుంటాడని, తన పెంపుడు పిల్లిని ఇంట్లో తాడుతో దూలానికి ఉరితీస్తూ వీడియో తీశాడని పోలీసులు వివరించారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గతంలోనూ కొందరు సామాజిక మాధ్యమాల్లో వీడియోల కోసం మూగజీవాలపై హింసకు పాల్పడి అరెస్టయిన ఘటనలు చోటు చేసుకున్నాయి.