కరోనా ధాటికి అమెరికాలో నిరుద్యోగ సంక్షోభం... ఉద్యోగులను సాగనంపుతున్న కంపెనీలు!
- అమెరికాలో కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థకు విఘాతం
- భారీగా ఉద్యోగాలను తొలగిస్తున్న కంపెనీలు, కార్యాలయాలు
- ఇప్పటివరకు 3.9 కోట్ల మంది ఉద్యోగుల తొలగింపు
కరోనా సంక్షోభంతో వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు భారీగా ఉద్యోగులను తొలగించే ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. అమెరికా కార్మిక శాఖ వద్ద నమోదవుతున్న నిరుద్యోగల సంఖ్యే అందుకు నిదర్శనం. కరోనా సంక్షోభం మొదలయ్యాక అమెరికా కార్మిక శాఖ వద్ద 3.86 కోట్ల మంది నిరుద్యోగులుగా తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. జూన్ నాటికి అమెరికాలో నిరుద్యోగ సమస్య గరిష్టంగా 25 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.