ఆయోధ్య రామజన్మభూమి వద్ద బయటపడిన శివలింగం

Idols of ancient era found in Ayodhya Rama Janma Bhumi
  • అయోధ్యలో నిర్మాణ పనులు
  • శివలింగంతో పాటు దేవతా మూర్తుల విగ్రహాలు లభ్యం
  • ఐదు అడుగుల ఎత్తున్న శివలింగం
దశాబ్దాల తరబడి నలిగిన అయోధ్య రామజన్మభూమి వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో సమసిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అయోధ్యలోని రామజన్మభూమి వద్ద నిర్మాణ పనులు జరుగుతుండగా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ అక్కడో శివలింగం లభ్యమైంది. ఈ శివలింగం ఎత్తు ఐదు అడుగులు ఉన్నట్టు గుర్తించారు.

రామజన్మభూమిలో గత కొన్నిరోజులుగా భూమి చదును చేసే కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో అక్కడి శిథిలాలను తొలగిస్తుండగా, శివలింగంతో పాటు 7 నల్లరాతి స్తంభాలు, 6 ఎర్రరాతి స్తంభాలు, ఓ కలశం, విరిగిపోయిన స్థితిలో మరికొన్ని దేవతామూర్తుల విగ్రహాలు బయటపడ్డాయి. ఇటీవలే అక్కడ పూర్ణకుంభం కూడా బయల్పడిందని వీహెచ్ పీ నేత వినోద్ భన్సల్ తెలిపారు.
Go Back to Shorts
Ayodhya Ram Mandir
Idols
Rama Janma Bhumi
Shivling
Pillars

More Telugu News