Hyderabad: నీళ్లు తాగుతూ మరోసారి స్థానికులకు కనపడ్డ చిరుత.. హుటాహుటిన హిమాయత్ సాగర్ చేరుకున్న సిబ్బంది

హైదరాబాద్ శివారులోని కాటేదాన్‌లో రోడ్డుపై కనిపించిన చిరుత ఎవరికీ చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. అది ఎక్కడ తమపై దాడి చేస్తుందోనని ప్రజలు భయపడుతున్న వేళ దాని ఆచూకీ కనుగొనేందుకు సిబ్బంది చేస్తోన్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఆ చిరుత తాజాగా హిమాయత్ సాగర్ వద్ద కనిపించినట్లు స్థానికులు పోలీసులకు చెప్పారు.

తమ ప్రాంతంలో ఓ చోట నీళ్లు తాగుతుండగా తాము చూశామని తెలిపారు. దీంతో అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని చిరుత ఆనవాళ్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అది చనిపోయిందని ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ  స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు చిరుత సురక్షితంగానే ఉందని అధికారులు భావిస్తున్నారు. కాటేదాన్‌లో ఆ చిరుత కనపడిన దృశ్యాలు ఇటీవల అలజడి రేపాయి.
Hyderabad
Ranga Reddy District
tiger

More Telugu News