తన పెళ్లి ఫొటోలపై వస్తోన్న మీమ్స్‌ను స్వయంగా పోస్ట్ చేసి నవ్వుకున్న హీరో నిఖిల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన పెళ్లి ఫొటోలపై వస్తోన్న మీమ్స్‌ను స్వయంగా పోస్ట్ చేసి నవ్వుకున్న హీరో నిఖిల్

nikhil marriage tweet
  • 'పెళ్లి జరిగింది'.. అంటూ సినీ హీరో నిఖిల్ ఓ పోస్ట్ 
  • మాస్కుల కోసం ఇక్కడికి వెళ్లండి..
  • శానిటైజర్‌ కోసం అక్కడికి వెళ్లండి అంటూ బోర్డు
  • పెళ్లి ఫొటోల కన్నా అధికంగా వైరల్ అవుతోన్న బోర్డు
'పెళ్లి జరిగింది'.. అంటూ సినీ హీరో నిఖిల్ చేసిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. పెళ్లి మండపంలోకి ప్రవేశించే ద్వారం వద్ద ఓ బోర్డు పెట్టారు. 'పల్లవి అండ్ నిఖిల్ పెళ్లి.. మాస్కుల కోసం ఇక్కడికి వెళ్లండి.. శానిటైజర్‌ కోసం అక్కడికి వెళ్లండి..' అంటూ అందులో సూచనలు చేశారు. ప్రేమ మాత్రం ప్రతి చోటా ఉంటుందని దాని కింద పేర్కొన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ ఐడియా అందరికీ నచ్చుతోంది.

                        
దీనిపై కొందరు మీమ్స్‌ చేస్తున్నారు. 'మాస్కులు, శానిటైజర్లు, ప్రేమ సరే.. మరి పెళ్లి భోజనం ఎక్కడ?' అంటూ మీమ్స్ చేశారు. దీనిపై స్పందించిన నిఖిల్‌ 'హాహాహా' అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీలను స్వయంగా  పోస్ట్ చేశాడు. మాస్కులు, శానిటైజర్ల ఈ కాన్సెప్ట్‌ అదిరింది అంటూ కొందరు పోస్టులు చేస్తున్నారు. నిఖిల్ పెళ్లి ఫొటోల కన్నా ఈ ఫొటోనే అధికంగా వైరల్ అవుతోంది. 
                 
nikhil
marriage
Twitter

More Telugu News