రేపు టాలీవుడ్ హీరో నిఖిల్ వివాహం
- ఒకటికానున్న హీరో నిఖిల్, డాక్టరు పల్లవి
- రేపు ఉదయం 6.31 గంటలకు పెళ్లి ముహూర్తం
- అతికొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలో జరగనున్న పెళ్లి
హిందూ సంప్రదాయపద్ధతిలో రేపు ఉదయం నిఖిల్-పల్లవిల వివాహం జరగనుంది. పెళ్లి ముహూర్తం 6.31 గంటలుగా నిర్ణయించినట్టు సమాచారం. హైదరాబాద్ శివార్లలోని నిఖిల్ ప్రైవేట్ విల్లాలో వీరి వివాహం జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసుల అనుమతి లభించింది. లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో వధూవరూల తరఫు నుంచి అతికొద్ది మంది బంధువులు మాత్రమే వీరి వివాహానికి హాజరుకానున్నారు. తమ వివాహానికి హాజరయ్యే వారు సామాజిక దూరం పాటించడం, మాస్క్ లు ధరించడం తప్పనిసరని నిఖిల్ ఇప్పటికే చెప్పినట్టు సమాచారం.