Devineni Uma: ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి జగన్‌ గారూ!: గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై దేవినేని ఉమ

విశాఖగ్యాస్ చట్టం ఎప్పుడు తీసుకువస్తారో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. 'ట్రస్టుకు డబ్బులు వెళ్లాయ్.. ఎల్జీకి అనుమతులొచ్చాయ్..  తూతూ మంత్రం కేసులుపెట్టారు.. ఆధారాలు చెరిపేస్తున్నారు..  స్టైరిన్/వేపర్ దేశం దాటిపోతుంది. ప్రజలకు ఊపిరందట్లేదు. విశాఖగ్యాస్ చట్టం ఎప్పుడు తీసుకువస్తారో ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పండి ఒక్కఛాన్స్ ముఖ్యమంత్రి గారు' అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా పలు వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలను దేవినేని ఉమ పోస్ట్ చేశారు. స్టైరిన్‌ విషవాయువు ప్రభావం గ్రామాల్లో ఇంకా తగ్గలేదని, నిన్న మరో పది మంది సొమ్మసిల్లి పడిపోయారని, వీరిలో ఇద్దరు వార్డు వాలంటీర్లు, ఇద్దరు ఆశావర్కర్లూ ఉన్నారని ఆ వార్తా పత్రికల్లో ఉంది. కళ్లలో మంటలు, వాంతులతో నానా ఇబ్బందులు పడుతున్నామని ఆర్‌ఆర్ వెంకటాపురం గ్రామస్థులు మీడియాకు తెలిపారు.

Devineni Uma
Telugudesam
YSRCP
Vizag Gas Leak

More Telugu News