చివరికి భల్లాలదేవుడు కూడా మన్మథ బాణానికి పడిపోయాడంతే: రానా-మిహీక అంశంలో చిరంజీవి స్పందన
- శుభవార్త చెప్పిన రానా
- తన ప్రియురాలు ఓకే చెప్పిందంటూ పోస్టు
- రానా, మిహీకాలకు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
"చివరికి భల్లాలదేవుడి అంతటి బలశాలి కూడా మన్మథుడి ప్రభావానికి చిక్కుకున్నాడు. ఈ లాక్ డౌన్ మీ పెళ్లికి దారితీసింది. మీ ఇద్దరికీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను, శతమానం భవతి" అంటూ ట్వీట్ చేశారు. చిరు మాత్రమే కాదు, రానా స్నేహితుడు రామ్ చరణ్, నితిన్, దేవిశ్రీప్రసాద్, కాజల్ అగర్వాల్, సాయితేజ్ తదితరులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.