2021లో రానున్న సరికొత్త 'స్విఫ్ట్' చిత్రాలు లీక్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

2021లో రానున్న సరికొత్త 'స్విఫ్ట్' చిత్రాలు లీక్!

New Model Swift Images Leaked
  • జపాన్ లో తయారవుతున్న మోడల్
  • ఆన్ లైన్ లో ప్రత్యక్షమైన బ్రోచర్
  • కారు మోడల్ ఫ్రెష్ గా ఉందంటూ కామెంట్లు
సుజుకీ సంస్థ మార్కెటింగ్ చేసే స్విఫ్ట్ మోడల్ కార్లకు ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. సంస్థ అందించే పాప్యులర్ బ్రాండ్ గా, ఇండియాలోనూ లక్షల సంఖ్యలో స్విప్ట్ వాహనాలు రోడ్లపై తిరుగుతూ ఉన్నాయి. వచ్చే సంవత్సరం మార్కెట్లోకి విడుదల అయ్యే సరికొత్త స్విఫ్ట్ వేరియంట్ చిత్రాలు, ఆన్ లైన్ లో లీక్ అయి, ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జపాన్ లో కారు మోడల్ ను తయారు చేసే పనిలో ఆర్ అండ్ డీ టీమ్ నిమగ్నమై ఉన్న వేళ, ఈ చిత్రాలు బయటకు వచ్చాయి.

ఇక పాత మోడల్ తో పోలిస్తే, కొంత తాజాదనాన్ని ఈ కారుకు జోడించినట్టు తెలుస్తోంది. ఫ్రంట్ బంపర్, గ్రిల్, అలాయ్ వీల్స్ మోడల్ ను మార్చినట్టు తెలుస్తోంది. టెయిల్ లైట్ డిజైన్ కు అనుగుణంగా బంపర్ కనిపిస్తోంది. కొత్త కలర్లలోనూ ఇవి ఉన్నాయి. బ్లాక్ రూఫ్, రష్ ఎల్లో, సిల్వర్ రూఫ్, ఫ్లేమీ ఆరంజ్ రంగుల్లో కారు ఉంటుందని ఈ చిత్రాలు చూపుతున్నాయి.

కారు డిజైన్ కు సంబంధించిన బ్రోచర్ ఆన్ లైన్ లో లీక్ అయింది. ఇక 2021 మోడల్ స్విఫ్ట్ లో 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ ఉంటుందని 0.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ దీనికి అదనపు ఆకర్షణగా నిలుస్తుందని వాహన రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం చివరినాటికి కారు విడిభాగాలు ప్రపంచంలోని అన్ని దేశాల సుజుకీ ప్లాంట్లకు చేరుతాయని, వచ్చే సంవత్సరం కారు విడుదలవుతుందని సమాచారం. 
Suzuki
Swift
New Model
Car

More Telugu News