Narendra Modi: లాక్ డౌన్ ను పొడిగించాలన్న పలువురు ముఖ్యమంత్రులు.. 'నో' చెప్పిన బీజేపీ సీఎం!

Gujarat CM not interested to continue lockdown
  • ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్
  • ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించకపోతే మనుగడ సాగించడం కష్టమన్న విజయ్ రూపానీ
  • ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచన
ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమైన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు, లాక్ డౌన్ కొనసాగింపు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించారు. ఈ సందర్భంగా కరోనాను కట్టడి చేయాలంటే లాక్ డౌన్ ను కొనసాగించాల్సిందేనని పలువురు ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

అయితే, లాక్ డౌన్ కొనసాగింపుకు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మాత్రం విముఖత వ్యక్తం చేశారు. దీర్ఘకాలం పాటు ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించకపోతే మనుగడ సాగించడం కష్టమని చెప్పారు. లాక్ డౌన్ ను పొడిగించకుండా... ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు.

More Telugu News

Narendra Modi
BJP
Video Conference
Chief Minister
Gujarat
Lockdown