అర్ధరాత్రి మళ్లీ లీకైన విషవాయువు.. ప్రాణభయంతో రోడ్లపైకి వందలాదిమంది!
- అర్ధరాత్రి రద్దీగా మారిన రోడ్లు
- సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న ప్రజలు
- గ్యాస్ బయటకు రాకుండా గడ్డకట్టించే ప్రయత్నం చేస్తున్న శాస్త్రవేత్తలు
మరోవైపు, పూణెకు చెందిన ఎన్విరాన్‌మెంట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన 9 మంది శాస్త్రవేత్తలు గ్యాస్ లీక్ అయిన ఎల్‌జీ పాలిమర్స్‌లోకి వెళ్లి పరిశోధన ప్రారంభించారు. న్యూట్రలైజర్‌ను ఉపయోగించి విషవాయువు బయటకు రాకుండా గడ్డకట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం సురక్షితంగా ఉందని, నేడు శాస్త్రవేత్తలు ప్రకటన చేయనున్నారని పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు.