Allu Arjun: 'పుష్ప' సినిమాలో 6 నిమిషాల ఫైట్ సీన్ కోసం 6 కోట్ల ఖర్చు!

  • సుకుమార్ రూపొందిస్తున్న 'పుష్ప'
  • మాస్ లుక్ తో కనిపించనున్న బన్నీ
  •  డాన్స్ .. ఫైట్స్ పై ప్రత్యేక శ్రద్ధ    
Pushpa Movie

అల్లు అర్జున్ .. సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రను పోషిస్తున్నాడు. పూర్తి మాస్ లుక్ తో ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడు.

ఈ సినిమాలో అడవి నేపథ్యంలో ఛేజింగ్ తో కూడిన ఒక యాక్షన్ సీన్ ను ప్లాన్ చేశారట. తెరపై ఈ ఫైట్ సీన్ 6 నిమిషాల పాటు వుంటుందట. ఈ 6 నిమిషాలకి గాను 6 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిని బట్టి ఈ యాక్షన్ సీన్ ను ఏ రేంజ్ లో చిత్రీకరిస్తున్నది అర్థం చేసుకోవచ్చు.

ఇక ఫైట్స్ విషయంలోనే కాదు .. డాన్సుల విషయంలోను సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. ఇంతవరకూ బన్నీ వేసిన స్టెప్స్  కాకుండా ఆయన స్టెప్స్ కొత్తగా ఉండేలా డిజైన్ చేయిస్తున్నాడట. ఈ డాన్సులు ఆయన అభిమానులను  ఎంతగానో ఆకట్టుకుంటాయని చెబుతున్నారు.  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి  ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.

More Telugu News