Donald Trump: మేం ఎంత కష్టపడినా వీళ్లింతే!: మీడియాపై ట్రంప్ అసహనం

Trump fires on media as they ignores government effrorts
షార్ట్స్‌లో చూడండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు, అక్కడి మీడియాలోని మెజారిటీ వర్గానికి పొసగదన్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.

"కరోనాను అంతం చేసేందుకు మేం ఎంతో చేస్తున్నాం. ప్రపంచంలో మరే ఇతర దేశం నిర్వహించనన్ని కరోనా టెస్టులు చేపడుతున్నాం. కానీ ఈ మీడియా మాత్రం ఫిర్యాదులు చేయడం తప్ప మరే విధంగానూ స్పందించదు. మేం వెంటిలేటర్ల విషయంలో తీసుకున్న చర్యల్లోనూ మీడియాది ఇదే వైఖరి. ప్రభుత్వ చర్యలు బాగున్నాయని వాళ్లెప్పుడూ చెప్పరు. దుర్మార్గంగా దేనినో దానిని తప్పుపడుతూనే వుంటారు" అంటూ ధ్వజమెత్తారు.
Go Back to Shorts
Donald Trump
Media
Corona Virus
USA

More Telugu News