లాలు చికిత్స పొందుతున్న వార్డులో కరోనా రోగి.. వైద్యుడి సహా సిబ్బంది మొత్తం క్వారంటైన్!

Corona patient in Lalu Prasad Yadav Ward
  • రాంచీలోని రిమ్స్‌లో లాలుకు చికిత్స 
  • ఆ వైద్యుడే కరోనా రోగికీ చికిత్స చేసిన వైనం
  • లాలుకు కరోనా పరీక్షలు?
బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్‌ చికిత్స పొందుతున్న వార్డులోని వ్యక్తి కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది. లాలుకు వైద్యం చేసిన వైద్యుడు డాక్టర్ ఉమేశ్ ప్రసాద్ ఆ వ్యక్తికి కూడా చికిత్స అందించడంతో డాక్టర్ సహా ఆ విభాగంలోని సిబ్బందిని అందరినీ మూడు వారాలపాటు క్వారంటైన్‌కు పంపారు.

లాలు ప్రస్తుతం రాంచీలోని రాజేంద్రనగర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని పేయింగ్ వార్డులో రెండేళ్లుగా చికిత్స తీసుకుంటున్నారు. కరోనా రోగికి చికిత్స చేసిన వైద్యుడే లాలూకు కూడా సేవలు అందిస్తుండడంతో ఆసుపత్రి యాజమాన్యం అప్రమత్తమైంది. వైద్యుడు సహా ఆ వార్డులోని సిబ్బంది అందరినీ మూడు వారాల క్వారంటైన్‌కు పంపినట్టు తెలిపింది. అలాగే, లాలూకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Lalu Prasad Yadav
Corona Virus
Doctor
Quarantine Centre

More Telugu News