Maharashtra: తరిమిన కుక్కలు.. జనావాసాల్లోకి పులికూన!

కుక్కలు తరుముకురావడంతో ఓ పులికూన జనావాసాల్లోకి వచ్చింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మూల్ తాలూకాలోని ససిదాబాగావ్‌లో జరిగిందీ ఘటన. తల్లి నుంచి తప్పిపోయిన పులి పిల్ల బయటకు రావడంతో గమనించిన కుక్కలు దానిని వెంబడించాయి.

ప్రాణభయంతో పరుగులు పెట్టిన పులిపిల్ల గ్రామంలోని ఓ పశువుల పాకలో దూరింది. గమనించిన గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే గ్రామానికి చేరుకుని పులి కూనను స్వాధీనం చేసుకున్నారు. దాని వయసు ఏడాదిలోపే ఉంటుందని చెప్పిన అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం దానిని చంద్రపూర్‌కు తరలించారు.
Maharashtra
Chandrapur
Tiger Cub

More Telugu News