కరోనా ఇప్పుడు మానవ సంక్షోభం... మున్ముందు మానవ హక్కుల సంక్షోభం కాబోతోంది: ఆంటోనియో గుటెర్రాస్
- కరోనా విపత్తుపై గుటెర్రాస్ వీడియో సందేశం
- కొన్ని సామాజిక వర్గాలపై దుష్ప్రభావం పడుతోందని వెల్లడి
- సాయం అందరికీ అందడంలేదని వ్యాఖ్యలు
కరోనా విపత్తు వేళ కొన్ని సామాజిక వర్గాలపై దుష్ప్రభావం పడుతోందని, విద్వేష ప్రసంగాలు చోటుచేసుకుంటున్నాయని, బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకోవడం పెరుగుతోందని, భద్రతా పరమైన సమస్యలు ఆరోగ్య అత్యయిక స్థితిని మరుగున పడేస్తున్నాయని గుటెర్రాస్ ఆందోళన వెలిబుచ్చారు. జాతి ఆధారిత జాతీయవాదం, వర్గ జనాభా ఆధిక్యత, నిరంకుశవాదం పెరుగుదల తదితర అంశాలు కొన్నిదేశాల్లో మానవ హక్కుల తిరోగమనానికి కారణమవుతున్నాయని వివరించారు.