'ఉప్పెన' తమిళ రీమేక్ లో హీరోగా విజయ్ తనయుడు
Add ap7am to your home Screen

'ఉప్పెన' తమిళ రీమేక్ లో హీరోగా విజయ్ తనయుడు

Vijay
  • తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఉప్పెన'
  • తమిళ రీమేక్ హక్కులు విజయ్ సేతుపతి చేతికి
  • కొడుకును హీరోగా పరిచయం చేసే ఆలోచనలో విజయ్
తెలుగులో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా 'ఉప్పెన' నిర్మితమైంది. బుచ్చిబాబు రూపొందించిన ఈ సినిమా ద్వారా కృతి శెట్టి కథానాయికగా పరిచయం కానుంది. ఈ సినిమాలో కథానాయిక తండ్రిగా .. ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. ఈ ప్రేమకథా చిత్రం ఈ నెల 2వ తేదీనే విడుదల కావలసింది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

ఈ సినిమా కథాకథనాలు నచ్చడంతో, తమిళ రీమేక్ హక్కులను విజయ్ సేతుపతి సొంతం చేసుకున్నాడు. హీరో విజయ్ మంచి టీనేజ్ లవ్ స్టోరీ దొరికితే తన తనయుడు జాసన్ సంజయ్ ను హీరోగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో వున్నాడు. ఆ విషయం తెలిసిన విజయ్ సేతుపతి, ఈ కథను గురించి విజయ్ కి చెప్పాడట. కథ నచ్చడంతో విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తెలుగులో తను చేసిన పాత్రనే తమిళంలోను విజయ్ సేతుపతి చేయనున్నాడట. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.
Vijay
Vijay Sethupathi
jason Sanjay

More Telugu News