లాక్ డౌన్ లో తొలిసారి హైదరాబాద్ కు వచ్చిన ఎయిర్ అంబులెన్స్!
- ఆఫ్గన్ లో పని చేస్తున్న హైదరాబాద్ నివాసి
- రోడ్డు ప్రమాదంలో వెన్నెముకకు గాయాలు
- ఎయిర్ అంబులెన్స్ కు అనుమతించిన అధికారులు
అతనికి అవసరమైన అత్యాధునిక వైద్యం ఆఫ్గన్ లో లభించే పరిస్థితి లేకపోవడంతో, ఐసీఏటీటీ హెల్త్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలోని ఎయిర్ అంబులెన్స్ లో హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు ప్రత్యేక అనుమతిని కోరగా, అధికారులు అంగీకరించారు. దీంతో అక్కడి డాక్టర్లు రాహుల్ సింగ్, శాలినీ నల్వాద్ లు బాధితుడిని వెంట తీసుకుని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆపై రోడ్డు మార్గం ద్వారా ఓ ప్రైవేటు ఆసుపత్రికి బాధితుడిని తరలించారు.