'పుష్ప'లో నా పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది: రష్మిక

Pushpa Movie
  • 'పుష్ప' సినిమాలో కొత్తగా కనిపిస్తాను
  • పూర్తి వైవిధ్యభరితమైన పాత్ర ఇది
  • ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందన్న రష్మిక  
సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో కలప అక్రమ రవాణా చేసే లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్ కనిపించనున్నాడు. అడవి నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ సినిమాలో కథానాయికగా రష్మిక నటిస్తోంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది.

తాజాగా ఈ సినిమాను గురించి రష్మిక మాట్లాడుతూ .. 'పుష్ప' సినిమాలో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది .. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఈ పాత్రలో నేను చాలా కొత్తగా కనిపిస్తాను. నటన పరంగా నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించే విధంగా ఈ పాత్ర ఉంటుంది. ఇంత త్వరగా ఇంతటి వైవిధ్యభరితమైన పాత్రను చేస్తానని నేను అసలు ఊహించలేదు. నా కెరియర్లో చెప్పుకోదగిన పాత్రగా నిలిచిపోతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు" అని చెప్పుకొచ్చింది.
Go Back to Shorts
Allu Arjun
Rashmika Mandanna
Sukumar

More Telugu News