వాహనాలకు ఇచ్చిన అనుమతులపై పునఃపరిశీలన: హైదరాబాద్ సీపీ అంజనీకుమార్
- వేర్వేరు కారణాలతో కొన్ని వాహనాలు తిరిగేందుకు అనుమతి
- రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ పొడిగింపుతో తాజా నిర్ణయం
- అనుమతి ఉన్న వారు కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
తెలంగాణలో ఈరోజు నుంచి లాక్డౌన్ను కొన్ని పరిమితులతో ఎత్తివేస్తారన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే నిన్న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సుదీర్ఘ సమావేశంలో లాక్డౌన్ గడువు పొడిగించడమే కాకుండా మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో సీపీ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అనుమతి ఉన్న వాహన చోదకులు కూడా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా విస్తరణ కట్టడికి పోలీసుల పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.