అయోమయంలో పడేస్తున్న 'శీనయ్య'
- దర్శకుడిగా వినాయక్ కి మంచి క్రేజ్
- హీరోగా సరికొత్త ప్రయోగం
- నిర్మాతగా 'దిల్' రాజు
వినాయక్ కి స్క్రిప్ట్ నచ్చకపోవడం .. అవుట్ పుట్ నచ్చకపోవడం .. తరచూ స్క్రిప్టులో మార్పులు చెప్పడం వంటి కారణంగా ఈ సినిమా షూటింగులో జాప్యం జరుగుతూ వచ్చిందట. ఈ ప్రాజెక్టు విషయంలో 'దిల్' రాజు విసిగిపోయాడనీ, ఆయన పట్టించుకోవడం మానేశారనే టాక్ వినిపిస్తోంది. మరో వైపున లాక్ డౌన్ తరువాత ప్రాజెక్టు ముందుకు వెళుతుందని మరికొందరు అంటున్నారు. ఇలా 'శీనయ్య' అభిమానులందరినీ అయోమయానికి గురి చేస్తున్నాడు.