'పుష్ప'లో విజయ్ సేతుపతి పాత్రలో ధనుంజయ

Pushpa Movie
  • సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప'
  • లాక్ డౌన్ తరువాత సెట్స్ పైకి
  • తమిళంలో ఇబ్బందవుతుందనే మార్పు 
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా 'పుష్ప' రూపొందుతోంది. రష్మిక కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో, అక్రమంగా కలపను తరలించే లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్ పాత్ర కోసం మొదట్లో విజయ్ సేతుపతిని తీసుకున్నారు. అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడం వలన, రీసెంట్ గా ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. విజయ్ సేతుపతి పాత్ర నెగెటివ్ షేడ్స్ తో కూడినదిగా వుంటుందట.

తమిళంలో ఈ సినిమాను విడుదల చేసినప్పుడు, విజయ్ సేతుపతి అభిమానులతో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆయనతో సుకుమార్ మాట్లాడే సున్నితంగా తప్పించినట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో 'భైరవగీత' హీరో ధనుంజయను తీసుకుంటున్నట్టుగా సమాచారం. ఇక విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో కనిపించనున్నట్టు చెబుతున్నారు.
Go Back to Shorts
Allu Arjun
Rashmika Mandanna
Dhanunjay
Sukumar

More Telugu News