అలాంటి పాత్రలు చేయాలని వుంది: రెజీనా

Regina Cassandra
  • తెలుగులో రెజీనాకి మంచి క్రేజ్
  • 'ఎవరు'తో దక్కిన విజయం
  • తమిళ సినిమాలపై దృష్టి
తెలుగులో కథానాయికగా రెజీనా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల కాలంలో ఇక్కడ ఆమె చేసిన 'ఎవరు' నటన పరంగా ఆమెకి మంచి మార్కులు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో హాట్ గా కనిపిస్తూ నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రను ఆమె పోషించింది. నిజం చెప్పాలంటే ఇది చాలా టిపికల్ రోల్. ఈ తరహా పాత్రలకు రెజీనా బాగా సెట్ అవుతుందని అంతా అనుకున్నారు.

తాజాగా ఆమె కూడా అదే మాట చెప్పింది. టిపికల్ గా అనిపిస్తూ నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలు .. హాట్ గా కనిపించే పాత్రలు చేయాలని ఉందంటూ తన మనసులో మాట చెప్పుకొచ్చింది. ఆ తరహా పాత్రలు చేయడంలో థ్రిల్ ఉంటుందని అంది. ఇటీవల కాలంలో రెజీనాకి ఇక్కడ అవకాశాలు తగ్గిన సంగతి తెలిసిందే. అందువలన ఆమె తమిళ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. ప్రస్తుతం అక్కడ ఆమె చేతిలో వరుస ప్రాజెక్టులు వున్నాయి.
Go Back to Shorts
Regina
Actress

More Telugu News