సానియా పదేళ్ల దాంపత్యం... భర్తకు రెండు ఫొటోలతో విషెస్ చెప్పిన టెన్నిస్ క్వీన్
- 2012 ఏప్రిల్ 10న షోయబ్ తో సానియా పెళ్లి
- హ్యాపీ యానివర్సరీ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు
- ఎక్స్ పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అంటూ సరదా వ్యాఖ్యలు
మొత్తానికి ఈ ఫొటోలతో సానియా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. టెన్నిస్ ఆటలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన సానియా.... ఓ పాకిస్థాన్ క్రికెటర్ ను పెళ్లాడుతుందని అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు. వీరి మధ్య ప్రేమ చిగురించడమే కాదు, అది పెళ్లి వరకు వెళ్లింది. వీరు తమ ప్రేమ విషయం ఎంతో గోప్యంగా ఉంచడమే కాదు, పెళ్లితో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. సానియా, షోయబ్ ల పెళ్లి 2010 ఏప్రిల్ 12న జరిగింది. ఈ క్రీడా జోడీకి ఇజాన్ మీర్జా మాలిక్ అనే తనయుడు ఉన్నాడు.