పగ తీర్చుకోవడం కోసమే స్మగ్లర్ గా మారే 'పుష్ప'
- పుష్పక్ నారాయణ్ గా బన్నీ
- అడవి నేపథ్యంలో సాగే కథ
- యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యత
దాంతో తన కుటుంబానికి అన్యాయం చేసిన స్మగ్లర్ల ఆటకట్టించడం కోసమే పుష్పక్ నారాయణ్ స్మగ్లర్ గా మారతాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. యాక్షన్ కి ఒక రేంజ్ లో అవకాశం వుండే కలప అక్రమ రవాణ .. అడవి నేపథ్యం, ఎమోషన్ కి అవకాశం వుండే ఫ్యామిలీ సెంటిమెంట్ తో ఈ కథను సుకుమార్ చాలా ఇంట్రెస్టింగ్ గా అల్లినట్టు తెలుస్తోంది. బన్నీ సరసన రష్మిక కథానాయికగా నటిస్తుండగా, ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి కనిపించనున్నాడు.