స్పెషల్ స్వీట్ సమోసా 'మునీర్' మృతి.. కరోనాతో కాదంటూ ఫ్లెక్సీలు!
- శుక్రవారం చీరాలలో మునీర్ అనే వృద్ధుడు మృతి
- కరోనాతో చనిపోయాడని అనుమానిస్తున్న కొందరు వ్యక్తులు
- కిడ్నీ ఫెయిల్యూర్ వల్లే చనిపోయారంటూ ఫ్లెక్సీలు
కనిగిరికి చెందిన మునీర్... బతుకుదెరువు కోసం 30 ఏళ్ల క్రితం చీరాలకు వచ్చారు. సమోసా వ్యాపారం చేస్తూ లాభాలను సంపాదించాడు. దీంతో, ఇతరులు కూడా అదే వ్యాపారాన్ని మొదలుపెట్టారు. దీంతో, మునీర్ కు గిరాకీ తగ్గింది. ఆ తర్వాత కొత్తగా ఏదైనా చేద్దామని ఆలోచించి... జీడిపప్పుతో స్వీట్ సమోసా చేయడాన్ని ప్రారంభించారు. దీని రుచికి చీరాల వాసులు బాగా ఆకర్షితులయ్యారు. కొన్ని రోజుల తర్వాత చీరాల స్వీట్ సమోసాగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ తర్వాత చీరాల స్వీట్ సమోసా అనేది మునీర్ ఇంటి పేరుగా మారిపోయింది.