సీతారామశాస్త్రి రాసిన పాటకి బదులుగా వర్మ నా పాటను రికార్డు చేయించాడు: కోన
- 'సత్య'కి మాటలు రాశాను
- పాట అలా ఓకే అయింది
- సిరివెన్నెల మెచ్చుకున్నారన్న కోన
సిరివెన్నెల రాసిన వెర్షన్స్ వర్మకి నచ్చడం లేదు. క్రిమినల్స్ పాడుకునే పాటకి పాండిత్యంతో పనిలేదు. అందువలన సరదాగా నేను ఆ ట్యూన్ కి పాట రాసి వర్మకి వినిపించాను. ఆయన 'ఇదీ నాకు కావలసింది' అని వెంటనే రికార్డ్ చేయించాడు. ఆ కేసెట్ తీసుకెళ్లి సిరివెన్నెలగారికి వినిపించి, జరిగింది చెప్పవలసిన బాధ్యతను నాపైనే పెట్టాడు.
దాంతో ఆ కేసెట్ తీసుకెళ్లి నా పాటను రికార్డు చేశారని సిరివెన్నెల గారికి వినిపించవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన ఏమనుకుంటారోననే టెన్షన్. అయితే ఆయన ఆ పాటను విని 'తను మరో పది వెర్షన్స్ రాసినా అలా వుండేది కాదు' అంటూ నన్ను హత్తుకున్నాడు. అదీ ఆయన గొప్పతనం" అని చెప్పుకొచ్చాడు.