కరోనా ఔషధాలతో జపాన్ వెళుతూ కుప్పకూలిన విమానం... ఎనిమిది మంది మృతి!
- మనీలా నుంచి హనెడా బయలుదేరిన ఫ్లయిట్
- టేకాఫ్ అవుతూనే కూలిపోయి మంటల్లో
- విమానంలోని అందరూ మృతి
గత మూడు వారాలుగా జపాన్ లో కరోనా వ్యాధి గ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో వైద్య పరికరాలతో ఈ విమానం హనెడాకు బయలుదేరింది. రన్ వేపైనే విమానం కాలిపోవడంతో, మనీలా నుంచి బయలుదేరాల్సిన ఇతర విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా, ఈ విమానం ప్రభుత్వానిది కాదని, లయన్ ఎయిర్ అనే చార్టెడ్ కంపెనీదని అధికారులు వెల్లడించారు. జరిగిన ప్రమాదంపై విచారణ జరిపిస్తున్నట్టు పేర్కొన్నారు. విమాన ప్రమాదంపై జపాన్, ఫిలిప్పీన్స్ ప్రభుత్వాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.