బాలీవుడ్ సింగర్ కనికకు మళ్లీ పాజిటివ్!

  • ‘కరోనా’ తో చికిత్స పొందుతున్న కనిక కపూర్
  • లక్నోలోని మెడికల్ సైన్సెస్ ఇనిస్టిట్యూట్ లో చికిత్స
  • తాజా వైద్య పరీక్షల్లో పాజిటివ్..కనిక కుటుంబ సభ్యుల ఆందోళన
బాలీవుడ్ సింగర్ కనిక కపూర్ కు మరోమారు ‘కరోనా’ పాజిటివ్ గా తేలింది. ఉత్తరప్రదేశ్, లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందుతున్న ఆమెకు నాల్గో సారి నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. ఇదిలా ఉండగా,  కనికకు మళ్లీ ‘కరోనా’ పాజిటివ్‌ రావడంతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేవుడిపై భారం వేయడం తప్ప మరోమార్గం లేదంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు.

Kanika kapur
Bollywood
singer
Corona Virus
lucknow

More Telugu News