Corona Virus: 100 కిలోమీట‌ర్లు న‌డిచి మృతి చెందిన డెలివ‌రీ బాయ్‌

delivery boy dies
షార్ట్స్‌లో చూడండి
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో వలస కార్మికులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. రోడ్డుపై వాహనాలకు అనుమతి లేకపోవడంతో కాలినడకనే కార్మికులు వందలాది కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. ఈ క్రమంలో 200 కిలోమీటర్ల ప్రయాణం ప్రారంభించిన ఓ డెలివరీ బాయ్‌ 100 కిలోమీటర్లు నడిచి ప్రాణాలు కోల్పోయాడు.

వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలోని తుగ్ల‌కాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లో ప‌నిచేస్తున్న ర‌ణ్‌వీర్ సింగ్‌ (39) లాక్‌డౌన్‌ నేపథ్యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని మోర్నే జిల్లాలో ఉన్న త‌న సొంత గ్రామానికి  బ‌య‌లుదేరాడు. ఢిల్లీ, ఆగ్రా హైవేలో కైలాష్ ట‌ర్నింగ్ వ‌ద్ద అతడికి ఛాతి నొప్పి వచ్చింది. ఆ సమయంలో ర‌ణ్‌వీర్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు కూడా ఉన్నారు.    అత‌డి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్ట‌ం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Go Back to Shorts
Corona Virus
New Delhi
Uttar Pradesh

More Telugu News