కిషన్ రెడ్డి, నిర్మలకు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పర్యవేక్షణ బాధ్యతలు
- తెలంగాణ 33 జిల్లాల అధికారులతో కిషన్ రెడ్డి సమన్వయం
- ఏపీలో 13 జిల్లాలను పర్యవేక్షించనున్న నిర్మల
- ఎప్పటికప్పుడు అధికారులకు తగిన సూచనలు
కరోనా పరిస్థితి, సహాయక చర్యలపై నేరుగా అధికారులతో చర్చించి వీరిద్దరూ ఎప్పటికప్పుడు వివరాలు సేకరించనున్నారు. వాటి ఆధారంగా అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగాలకు తగిన సూచనలు ఇవ్వాలని కేంద్ర మంత్రులను ప్రధాని మోదీ ఆదేశించారు. తెలంగాణలో ఇప్పటిదాకా 45 కేసులు నమోదవగా, ఏపీలో 11 మందికి కరోనా వైరస్ సోకింది.