శీనన్నా... జరంత చేతులు కడుక్కోరాదే: దానం నాగేందర్
- లాక్ డౌన్ వేళ తలసాని క్షేత్రస్థాయి పరిశీలన
- దానం నాగేందర్ ఇంటికి వెళ్లిన తలసాని
- శానిటైజర్ ను స్వయంగా ఇచ్చిన దానం
తన ఇంటి వద్ద శానిటైజర్ లను ఏర్పాటు చేసిన దానం నాగేందర్, వాటిని తానే స్వయంగా అందరికీ అందించి, చేతులు శుభ్రం చేసుకోవాలని కోరారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అరచేతిపై శానిటైజర్ ను వేశారు. ఆయనతో చేతులు కడిగించారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, ప్రజలు ఒకేసారి దుకాణాల వద్దకు వెళ్లకుండా ఉండాలని అన్నారు. బేగంబజార్ హోల్ సేల్ మార్కెట్ లో 300 దుకాణాలు ఉన్నాయని, పక్కపక్కనే ఉన్న దుకాణాలు తెరవకుండా, రోజుకు 40 దుకాణాలు తెరచుకుని వ్యాపారాలు చేసుకోవాలని సూచించినట్టు తెలిపారు.