'జెర్సీ' రీమేక్ ను అందుకే ఒప్పుకోలేదు: హీరోయిన్ రష్మిక
- 'జెర్సీ' హిందీ రీమేక్ కోసం అడిగారు
- నిజానికి అది చాలా మంచి సినిమా
- రియలిస్టిక్ సినిమాలు చేయదలచుకోలేదన్న రష్మిక
ఈ విషయం గురించి రష్మిక మాట్లాడుతూ, "హిందీ 'జెర్సీ'లో చేయమని అడిగారు .. కానీ నేను అంగీకరించలేదు. 'జెర్సీ' మంచి సినిమా కాదని కాదు .. అది రియలిస్టిక్ మూవీ. ప్రస్తుతానికి నేను ఈ తరహా సినిమాలు చేయదలచుకోలేదు. కమర్షియల్ సినిమాలు మాత్రమే చేయాలనుకుంటున్నాను. అందువల్లనే 'జెర్సీ' హిందీ రీమేక్ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించాను" అని చెప్పుకొచ్చింది.