రైతులు, మహిళలు, యువతకి ఉద్యమ వందనాలు: నారా లోకేశ్

  • జై అమరావతి ఉద్యమం 100 రోజులకు చేరుకుంది
  • పెయిడ్ ఆర్టిసులు అన్నారు
  • రైతులు గోచి కట్టుకుని బురదలో ఉండాలి అంటూ అవమానించారు
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏపీ ప్రజలు జై అమరావతి ఉద్యమాన్ని వదలట్లేదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. పోరాడుతున్న వారికి వందనాలు తెలుపుతున్నానంటూ ట్వీట్లు చేశారు.

'జై అమరావతి ఉద్యమం 100 రోజులకు చేరుకుంది. పెయిడ్ ఆర్టిసులు, రైతులు గోచి కట్టుకుని బురదలో ఉండాలి అంటూ అవమానాలు ఒక పక్క... లాఠీ దెబ్బలు, వేల సంఖ్యలో కేసులు, వేల మందిని జైలుకి పంపడం మరో పక్క... అయినా సహనం కోల్పోలేదు. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు అమరావతిని కాపాడుకోవడానికి వంద రోజులుగా మేము సైతం అంటూ ముందుకు వచ్చిన రైతులు, మహిళలు, యువతకి ఉద్యమ వందనాలు' అని పేర్కొన్నారు.

Nara Lokesh
Telugudesam
Andhra Pradesh

More Telugu News