సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Shruti Hassan in self quarentine in Mumbai
  • ఇంట్లో ఒంటరిగా శ్రుతి హాసన్!
  • వచ్చే ఏడాదికి ప్రభాస్ సినిమా వాయిదా 
  • నితిన్ వివాహంపై అప్ డేట్
 *  ప్రస్తుతం తాను స్వీయ నిర్బంధంలో వున్నానని చెప్పింది కథానాయిక శ్రుతి హాసన్. 'పది రోజుల క్రితం లండన్ నుంచి వచ్చాను. అందుకే ముంబైలో అమ్మతో కాకుండా వేరేగా స్వీయ నిర్బంధంలో వున్నాను. నాతో పాటు ఇంట్లో ఎవరూ లేరు.. పని వాళ్లు కూడా లేరు.. నా వంట నేనే చేసుకుంటున్నాను.. నాకు నేనే కంపెనీ ఇచ్చుకుంటున్నాను' అని చెప్పింది.
*  ప్రభాస్ హీరోగా 'మహానటి' ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్న సంగతి విదితమే. ఈ ఏడాది చివర్లో ఇది సెట్స్ కి వెళ్లాల్సి వుంది. అయితే, ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న చిత్రం షూటింగ్ వాయిదా పడడంతో నాగ్ అశ్విన్ చిత్రం వచ్చే ఏడాదికి వాయిదా పడినట్టు తెలుస్తోంది.
*  ఈ ఏప్రిల్ 16న దుబాయ్ లో తన వివాహాన్ని హీరో నితిన్ గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్న విషయం, కరోనా నేపథ్యంలో వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అదే ముహూర్తానికి హైదరాబాదులో అతికొద్ది మంది బంధువుల సమక్షంలో వీరి వివాహం జరగనున్నట్టు తాజా సమాచారం.      
Shruti Hassan
Prabhas
Nag Ashwin
Nithin

More Telugu News