నేడు శ్రీ శార్వరీ నామ సంవత్సర ఉగాది... బోసిపోయిన ఆలయాలు!
- ఆలయాల్లోకి భక్తుల ప్రవేశంపై నిషేధం
- అన్ని దేవాలయాల్లో ఏకాంత పూజలే
- మార్కెట్లలో కనిపించని ప్రజలు
కరోనా భయంతో ఇప్పటికే ఆలయాలకు భక్తుల రాకను అనుమతించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను ప్రకటించిన నేపథ్యంలో, అన్ని దేవాలయాల్లోనూ ఏకాంత పూజలే జరుగుతున్నాయి. ఈ ఉదయం 6 గంటల సమయంలో మార్కెట్లు తెరచుకున్నా, ప్రజల సందడి నామమాత్రంగానే కనిపిస్తోంది. మార్కెట్లో వేపపూత నామమాత్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది.