Odisha: లాక్ డౌన్ సమయంలో పెళ్లి రిసెప్షన్... పెళ్లికొడుకుని లోపలేసిన పోలీసులు!

Marriage Reception in Lockdown time
షార్ట్స్‌లో చూడండి
ఎంతో ఆనందంగా వివాహం చేసుకున్నానన్న ఆ యువకుడి ఆనందం ముచ్చటగా మూడు రోజులైనా మిగల్లేదు. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో ఈ గానా భజానాలు, విందులు ఏంటని ప్రశ్నిస్తూ, ఏకంగా వరుడినే అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లడంతో బంధుమిత్రులంతా కంగుతిన్నారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే, కంధమల్ జిల్లా, నౌపాద గ్రామంలో పరమేశ్వర్ భుక్తా అనే యువకుడి పెళ్లి రిసెప్షన్ కు ఏర్పాట్లు జరిగాయి. ఈ విందుకు సుమారు 80 మంది వరకూ గ్రామస్తులు హాజరయ్యారు. ఇప్పటికే ఏడుగురి కన్నా ఎక్కువ మంది ఓ ప్రాంతంలో చేరవద్దని ఒడిశా సర్కారు ఆదేశించి వుండటంతో, విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, రిసెప్షన్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి, వరుడిని పోలీసు స్టేషన్ కు తరలించారు.
Go Back to Shorts
Odisha
Marriage Reception
Police
Arrest
Corona Virus

More Telugu News