వాయిదా పడిన సినిమాల జాబితాలో '83'
- కపిల్ జీవితచరిత్ర ఆధారంగా '83'
- ముందుగా అనుకున్న విడుదల తేదీ ఏప్రిల్ 10
- త్వరలో కొత్త విడుదల తేదీ ప్రకటన
భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాను, ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో భాగంగా తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలియజేస్తూ నిర్మాతలు ఒక ప్రకటన చేశారు. పరిస్థితులు చక్కబడిన తరువాత కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు.