జగన్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి చివాట్లు తిన్నారు: యనమల
- డిపాజిట్లు కూడా రావని వైసీపీ భయపడుతోందన్న యనమల
- ప్రజల ప్రాణాలంటే జగన్ కు లెక్కలేదని విమర్శలు
- సర్కారు వింతపోకడలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని వ్యాఖ్యలు
ప్రపంచదేశాలన్నీ కరోనాపై సత్వర చర్యలు తీసుకుంటుంటే జగన్ సర్కారు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జగన్ ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలు జరపడమే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ప్రతి గంటకు కరోనాపై సమీక్షిస్తున్నారని, ఏపీలో ఆరోగ్య శాఖ కార్యదర్శి ఏం చేస్తున్నారో తెలియడంలేదని యనమల వ్యాఖ్యానించారు. వైసీపీ సర్కారు వింత పోకడలతో ఆశ్చర్యానికి గురిచేస్తోందని అన్నారు.