ఎన్నికల వాయిదా మంచిదే.. కానీ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది: వైసీపీ ఎంపీ
- కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయడం మంచిదే
- కానీ ఎన్నికలు జరిగితేనే 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయి
- ఎన్నికల వాయిదాతో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోతుంది
కరోనా వైరస్ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయడం మంచిదే అని సంజీవకుమార్ చెప్పారు. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితేనే 14వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. ఎన్నికలు వాయిదా పడటంతో రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం జరిగినట్టేనని చెప్పారు. కర్నూలు జిల్లా తుగ్గలిలో జరిగిన ఓ కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.