ఎన్నికలు వాయిదా పడితే కొంపలేమన్నా మునిగిపోతాయా?: సోమిరెడ్డి
- ఎన్నికల విషయంలో ఈసీకి పూర్తి అధికారాలు ఉంటాయి
- కరోనా వల్ల రాష్ట్ర ప్రజలకు ముప్పు ఉండడంతో వాయిదా
- పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు వాయిదా వేయాలని మమతా బెనర్జీ కోరారు
- జగన్ మాత్రం మరోలా మాట్లాడుతున్నారు
'అధికారులను ఈసీ ఎలా బదిలీ చేస్తుందని గగ్గోలు పెడుతున్నారు. 2019 ఎన్నికలప్పుడు ఆ విషయం తెలియదా?.. రాజ్యాంగబద్ధమైన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదు. కులాలు అంటగట్టడం దురదృష్టకరం.. అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో..' అని ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్నికలు వాయిదా పడితే కొంపలేమన్నా మునిగిపోతాయా? అని ప్రశ్నించారు.