వైసీపీ రాజ్యసభ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన సీఎం జగన్‌

  • జగన్‌ను కలిసిన అభ్యర్థులు
  • పిల్లి సుభాష్, మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి, నత్వానీకి బీ-ఫారాలు
  • ఫేస్‌బుక్‌లో తెలిపిన జగన్ 
రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి పోటీ చేయనున్న వైసీపీ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణ, గుంటూరు నేత అయోధ్య రామిరెడ్డి, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేట్‌ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, ఎంపీ పరిమళ్‌ నత్వానీ రాజ్యసభ నుంచి పోటీ చేయనున్నారు.

ఈ నేపథ్యంలో వారికి సీఎం జగన్‌ ఈ రోజు బీ-ఫారాలు ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన ఫేస్‌బుక్‌ ఖాతాలో తెలిపారు. 'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్య‌స‌భ‌కు పోటీ చేస్తున్న పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, ఆళ్ల అయోధ్య‌ రామిరెడ్డి, ప‌రిమ‌ళ్ న‌త్వానిల‌కు బీ-ఫారాలు ఇచ్చాను' అని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశారు.  


More Telugu News