Indigo: కీలక చర్యలు చేపట్టిన ఇండిగో

                        717                364                                      361                                 10
  • వివిధ విమానాశ్రయాల్లో తమ విమానాల రాకపోకల కోసం కేటాయించిన స్లాట్లలో 717 స్లాట్లను ఖాళీ చేసిన ఇండిగో సంస్థ 
  • ఇందులో మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్‌పోర్టుల నుంచే 364 స్లాట్లు  
  • అత్యధిక భాగం హైదరాబాద్, బెంగళూరు నగరాలకు చెందినవే
దేశీయ విమానయాన రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఇండిగో తన కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలలో తమ విమానాల రాకపోకల కోసం కేటాయించిన స్లాట్లలో 717 స్లాట్లను ఇండిగో సంస్థ ఉపసంహరించుకుంది. ఇందులో ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి 364 స్లాట్లు ఉండగా, వాటిలో అధిక శాతం హైదరాబాద్, బెంగళూరు నగరాలకు చెందినవి కావడం గమనార్హం.

విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్ కోసం కేటాయించే వ్యవధిని సాధారణంగా స్లాట్‌గా వ్యవహరిస్తారు. ఇండిగో సంస్థ జనవరి నుంచి మార్చి మధ్య కాలానికి చెందిన స్లాట్లను వదులుకోగా, మార్చి నెలలో అత్యధికంగా 361 స్లాట్లను ఖాళీ చేసినట్లు సమాచారం. గత డిసెంబరులో ఇండిగో సంస్థ వేల సంఖ్యలో విమాన సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ పరిస్థితులను తీవ్రంగా పరిగణించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఇండిగో వింటర్ షెడ్యూల్‌లో 10 శాతం కోత విధించింది. ఈ చర్యల అనంతరం ఇండిగో కార్యకలాపాలు క్రమంగా స్థిరపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 
Indigo
Indigo Airlines
Airlines
Flight Slots
DGCA
Flight Schedule
Hyderabad Airport
Bangalore Airport
Aviation
India

More Telugu News