Palash Muchhal: పెళ్లి రోజున‌ మరో యువతితో పలాశ్ ముచ్చల్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు: స్మృతి మంధాన మిత్రుడు

Palash Muchhal Caught Red Handed with Another Woman on Wedding Day Friend Claims
  • క్రికెటర్ స్మృతి మంధానతో సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ పెళ్లి రద్దు
  • పలాశ్ మోసం చేయడం వల్లే పెళ్లి ఆగిపోయిందన్న నిర్మాత విజ్ఞాన్ మానే
  • రూ.40 లక్షలు మోసం చేశాడని పలాశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విజ్ఞాన్
  • ఆరోపణలను ఖండించిన పలాశ్.. న్యాయపరంగా తేల్చుకుంటానని వెల్లడి
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌ల వివాహం అర్ధాంతరంగా రద్దయిన విషయం తెలిసిందే. అయితే, ఈ పెళ్లి ఎందుకు ఆగిపోయిందనే దానిపై ఇప్పుడు సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలాశ్.. స్మృతిని దారుణంగా మోసం చేశాడని, అందుకే ఈ వివాహం రద్దయిందని నటుడు, నిర్మాత విజ్ఞాన్ మానే ఆరోపించడం కలకలం రేపుతోంది. తాను స్మృతికి చిన్ననాటి స్నేహితుడినని ఆయన చెప్పుకున్నారు.

విజ్ఞాన్ మానే కథనం ప్రకారం 2025 నవంబర్ లో జరిగిన పెళ్లి వేడుకల సమయంలో పలాశ్ మరో మహిళతో ఒక గదిలో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. "అది ఒక భయానక దృశ్యం. ఆ సమయంలో అక్కడే ఉన్న భారత మహిళా క్రికెటర్లు అతడిని చిత‌క‌బాదారు" అని విజ్ఞాన్ ఒక జాతీయ మీడియా సంస్థకు వెల్లడించారు. ఈ సంఘటన తర్వాతే స్మృతి పెళ్లిని రద్దు చేసుకుందని ఆయన తెలిపారు.

కేవలం వ్యక్తిగత ఆరోపణలే కాకుండా, పలాశ్ తనను ఆర్థికంగానూ మోసం చేశాడని విజ్ఞాన్ ఆరోపించారు. ఒక సినిమా నిర్మాణం కోసం పలాశ్‌కు రూ.40 లక్షలు ఇచ్చానని, ఆ డబ్బును ఆయన కాజేశాడని మహారాష్ట్రలోని సాంగ్లీలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. "పెళ్లి రద్దయిన తర్వాత పలాశ్ కుటుంబం నన్ను అన్ని విధాలుగా దూరం పెట్టింది. సినిమా బడ్జెట్ రూ.1.5 కోట్లకు పెరిగిందని, మరో రూ.10 లక్షలు ఇవ్వాలని, లేదంటే పాత డబ్బు తిరిగి రాదని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది" అని విజ్ఞాన్ వివరించారు. 

విజ్ఞాన్ మానే ఆరోపణలను ఖండించిన పలాశ్ ముచ్చల్  
అయితే, విజ్ఞాన్ మానే చేసిన ఆరోపణలన్నింటినీ పలాశ్ ముచ్చల్ తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ నిరాధారమైనవని కొట్టిపారేశారు. "నా ప్రతిష్ఠ‌కు భంగం కలిగించే దురుద్దేశంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నారు. వీటిని నేను వదిలిపెట్టను. నా న్యాయవాది ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను" అని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇరువర్గాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో తీవ్రరూపం దాల్చింది. ఈ వివాదం ఇప్పుడు న్యాయపోరాటానికి దారితీయడంతో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
Palash Muchhal
Smriti Mandhana
Vignan Mane
Indian women cricketer
marriage cancellation
cheating allegations
financial fraud
Bollywood music director
controversy
Sangli police

More Telugu News