Kamaal R Khan: కాల్పుల కేసులో నటుడు, సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ అరెస్ట్

Kamaal R Khan Arrested in Shooting Case
  • ఈ నెల 18న నివాస భవనంపైకి దూసుకెళ్లిన బుల్లెట్లు
  • గన్ శుభ్రం చేశాక టెస్ట్ ఫైరింగ్ చేశానని వెల్లడి
  • కేఆర్కే లైసెన్స్‌డ్ తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు
వివాదాస్పద నటుడు, సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే)ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని ఓషివారా ప్రాంతంలో జనవరి 18న జరిగిన కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడిగా గుర్తించి శుక్రవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు తానే బాధ్యుడినని విచారణలో కేఆర్కే అంగీకరించినట్లు సమాచారం.

ఈ నెల 18న ఓషివారాలోని నలందా అపార్ట్‌మెంట్‌పైకి కొన్ని బుల్లెట్లు దూసుకొచ్చాయి. అపార్ట్‌మెంట్‌లోని రెండో అంతస్తులో నివసించే రచయిత నీరజ్ కుమార్ మిశ్రా, నాలుగో అంతస్తులో ఉండే మోడల్ ప్రతీక్ బైద్ ఫ్లాట్లలో ఈ బుల్లెట్లను గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేఆర్కేను ప్రధాన అనుమానితుడిగా గుర్తించారు.

పోలీసుల విచారణలో కేఆర్కే ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. తన లైసెన్స్‌డ్ గన్‌ను శుభ్రం చేసిన తర్వాత దాని పనితీరును పరీక్షించేందుకు కాల్పులు జరిపానని ఆయన చెప్పినట్లు సమాచారం. తన ఇంటికి ఎదురుగా ఉన్న మడ అడవుల వైపు గాల్లోకి కాల్చానని, అయితే గాలి కారణంగా బుల్లెట్లు పక్కకు వెళ్లి భవనాన్ని తాకి ఉండొచ్చని వివరించారు. ఉద్దేశపూర్వకంగా భవనంపైకి కాల్పులు జరపలేదని పేర్కొన్నారు.

కేఆర్కే నుంచి లైసెన్స్‌డ్ తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని జోన్ 9 డీసీపీ దీక్షిత్ గెడమ్ ధ్రువీకరించారు. 
Kamaal R Khan
KRK
Kamaal R Khan arrest
Mumbai Police
Oshiwara shooting case
Bollywood critic
firearms offense
Neeraj Kumar Mishra
Prateek Baid
Mumbai crime

More Telugu News